లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై షమీ పోటీ చేస్తున్నాడా.?

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టికెట్‌పై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని

By Medi Samrat  Published on  8 March 2024 8:32 PM IST
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై షమీ పోటీ చేస్తున్నాడా.?

భారత క్రికెటర్ మహ్మద్ షమీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) టికెట్‌పై వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతుంది. నివేదిక‌ల ప్ర‌కారం.. పశ్చిమ బెంగాల్ నుండి షమీని బ‌రిలోకి దింపేందుకు బీజేపీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ మేర‌కు పార్టీ అధిష్టానం అతడిని సంప్ర‌దించినా.. ష‌మీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్ర‌చారం జ‌రుగుతోంది. షమీ రంజీ ట్రోఫీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

ఇదిలావుంటే.. బెంగాల్ నుండి షమీని పోటీకి దింపడం వల్ల రాష్ట్రంలోని మైనారిటీలు అధికంగా ఉండే నియోజకవర్గాలలో ఓట్లను సాధించడంలో కాషాయ‌ పార్టీ విజ‌య‌వంతం కానుంద‌నేది వార్త‌ల సారాంశం. ఇటీవల చీలమండ శస్త్రచికిత్స తర్వాత ష‌మీ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. 2023 ODI ప్రపంచ కప్ లో ష‌మీ గాయపడ్డాడు. అప్ప‌టినుంచి ష‌మీ ఏ ఫార్మ‌ట్ క్రికెట్ ఆడలేదు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌ నుంచి కాషాయ‌ పార్టీ మహమ్మద్‌ షమీని పోటీకి దింపుతుందని నివేదికలు సూచిస్తున్నప్పటి.. ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు.

Next Story