Video : 'తిరిగి రావాలని కోరిక'.. చాలా క‌ష్ట‌ప‌డుతున్న ష‌మీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు

By Medi Samrat  Published on  25 July 2024 2:23 PM IST
Video : తిరిగి రావాలని కోరిక.. చాలా క‌ష్ట‌ప‌డుతున్న ష‌మీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. 33 ఏళ్ల షమీ వన్డే ప్రపంచకప్ తర్వాత శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆ త‌ర్వాత‌ ఏ మ్యాచ్ ఆడలేదు. షమీ ఇటీవలే బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ష‌మీ జిమ్‌లో శిక్షణ పొందుతున్న వీడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో షేర్ చేశాడు. వీడియోతో.. "తిరిగి రావాలనే కోరిక నాకు బలమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది" అని క్యాప్షన్ రాశాడు. మహ్మద్ షమీ జిమ్‌లో బరువు ఎత్తుతూ వీడియోలో కనిపిస్తాడు. తమ అభిమాన ఫాస్ట్ బౌలర్ వర్క్ అవుట్ చేయడం చూసి క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఒక నెటిజ‌న్ స్పందిస్తూ "మ‌నం 2027 ODI ప్రపంచకప్‌ను గెలవాలి సార్" అని వ్యాఖ్యానించగా.. మ‌రొక‌రు "బ్రదర్, త్వరగా కోలుకొని తిరిగి రండి" అని రాశాడు. ఇవే కాకుండా.. మహ్మద్ షమీ త్వరలో క్రికెట్ మైదానంలోకి తిరిగి వస్తాడని దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఆశిస్తున్నారు.

ODI ప్రపంచ కప్ 2023 తర్వాత మడమ గాయంతో మహ్మద్ షమీ ఇబ్బంది పడ్డాడు. షమీకి గాయం తీవ్రంగా ఉండడంతో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో షమీకి శస్త్రచికిత్స జరిగింది. దాని కారణంగా అతడు IPL, T20 ప్రపంచ కప్‌ల‌ నుంచి తప్పుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో షమీ 7 మ్యాచ్‌ల్లోనే 24 వికెట్లు పడగొట్టి అద్భుత ప్రదర్శన చేశాడు.

Next Story