భారత పేసర్ మహ్మద్ షమీ రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ పోరులో షమీ అద్భుతంగా రాణించాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫస్ట్-క్లాస్ గణాంకాలను నమోదు చేశారు. కేవలం 22.1 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చి 8 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నారు. జమ్మూ కశ్మీర్ జట్టు 302 పరుగులకు ఆలౌట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు షమీ. అంతేకాకుండా బెంగాల్ జట్టుకు మొదటి ఇన్నింగ్స్‌లో 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.
షమీ ఈ రంజీ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో మొత్తం 36 వికెట్లు పడగొట్టారు. షమీ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.