లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో రోహిత్ శర్మ మోకాలి గాయం కారణంగానే ఆడలేకపోయాడని ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ధృవీకరించారు. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు గాయం అవ్వడంతోనే రోహిత్ శర్మను పక్కన పెట్టినట్లు కోచ్ తెలిపారు. "ఐటీ బ్యాండ్‌లో రోహిత్ మోకాలికి గాయం అయింది. రోహిత్ బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నించాడు, దానిపై ఎటువంటి బరువు పెట్టలేకపోయాడు" అని జయవర్ధనే మ్యాచ్ తర్వాత విలేకరుల సమావేశంలో వెల్లడించాడు. రోహిత్ ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకున్నాడని, బ్యాటింగ్ చేయడం అతనికి అసౌకర్యంగా అనిపించిందని జయవర్దనే వివరించాడు. రోహిత్ కు మోకాలి దగ్గర గాయమయిందని, రోహిత్ కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించామని జయవర్ధనే తెలిపాడు.
వరుసగా విఫలమవుతున్న రోహిత్ ను మూడో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారు. నాలుగో మ్యాచ్ లో పక్కన పెట్టేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆడిన మూడు మ్యాచ్ లలో 0, 8, 13 పరుగులు మాత్రమే చేశాడు. లక్నోతో జరిగిన మ్యాచ్ లో రోహిత్ ఆడలేదు.