జానీ మాస్టర్ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  19 Sept 2024 8:16 PM IST
జానీ మాస్టర్ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై స్పందిస్తూ ఉన్నారు. తాజాగా నటుడు మంచు మనోజ్ కూడా స్పందించారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఎంత శ్రమించారో పరిశ్రమలో అందరికీ తెలుసని.. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు తన మనసును ముక్కలు చేసిందని మంచు మనోజ్ తెలిపారు. తప్పు ఒప్పులను చట్టం నిర్ణయిస్తుందని, నిజం ఎప్పటికైనా బయటకొస్తుందన్నారు. మీరు పారిపోవడం, సమాజానికి, భవిష్యత్ తరాలకు ప్రమాదకరమైన సంకేతాన్నిస్తుందని మంచు మనోజ్ తెలిపారు. మీరు ఏ తప్పూ చేయకపోతే పోరాటం చెయ్యాలని మనోజ్ సూచించారు.

ట్విట్టర్ లో నాగబాబు ఆసక్తికర పోస్టులు:

జ‌న‌సేన నేత‌, సినీ నటుడు నాగబాబు ట్విట్ట‌ర్‌ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టులు పెట్టారు.

"చ‌ట్ట ప్ర‌కారం నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు" అనే సర్ విలియం గారో కోట్‌ను పోస్ట్ చేశారు. "మీరు వినేదే న‌మ్మొద్దు. ప్ర‌తి క‌థ‌కు మూడు కోణాలు ఉంటాయి... మీది, అవ‌త‌లి వ్యక్తులది, నిజం" అనే రాబ‌ర్ట్ ఇవాన్స్ కోట్‌ను కూడా ట్వీట్ చేశారు. జానీ మాస్ట‌ర్‌కు మ‌ద్ద‌తుగా నాగ‌బాబు ఈ పోస్టులు చేశార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది.

Next Story