నేడు వాంఖడేలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి అసలైన పరీక్ష..!
ముంబై ఇండియన్స్ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా గతంలో ఎన్నో విజయాలను అందించాడు. ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ వెళ్ళిపోయాడు.
By Medi Samrat Published on 1 April 2024 2:15 PM ISTముంబై ఇండియన్స్ ఆటగాడిగా హార్దిక్ పాండ్యా గతంలో ఎన్నో విజయాలను అందించాడు. ఆ తర్వాత గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఒకసారి టైటిల్ నెగ్గగా.. మరోసారి ఫైనల్ దాకా జట్టును తీసుకుని వెళ్ళాడు. అయితే తిరిగి హార్దిక్ ముంబై ఇండియన్స్ గూటికి చేరాడు. అయితే యాజమాన్యం హార్దిక్ పాండ్యాను రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ గా నియమించింది. ఇది చాలా మంది అభిమానులకు షాకింగ్ గా అనిపించింది. ఇక సీజన్ మొదలైనప్పటి నుండి ముంబై ఇండియన్స్ ఆడిన రెండు మ్యాచ్ లలోనూ ఓటమిని మూటగట్టుకుంది. మొదటి మ్యాచ్ లో గెలవాల్సి ఉండగా ఓటమి పాలైంది. రెండో మ్యాచ్ లో రికార్డు లక్ష్యాన్ని దాదాపుగా ఛేజ్ చేసినంత పని చేసింది. ఇక మూడో మ్యాచ్ నేడు వాంఖడే వేదికగా సాగనుంది. ఈ మ్యాచ్ లో అయినా హార్దిక్ మొదటి విజయాన్ని అందుకుంటాడా.. లేదా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు.
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు నిజమైన పరీక్ష ఏప్రిల్ 1న ఎదురవ్వనుంది. సోమవారం వాంఖడే స్టేడియంలో అజేయమైన రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ముంబై హోం గ్రౌండ్ కావడంతో ఈ మ్యాచ్‌కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో హార్దిక్ మొదటి విజయాన్ని అందించగలడా? లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది. హార్దిక్ సహచరుడు, పీయూష్ చావ్లా, ఈ సీజన్‌లోని మొదటి హోమ్ గేమ్‌కు జట్టు సన్నద్ధమవుతున్నప్పుడు MI కెప్టెన్ పై ప్రేక్షకుల ప్రతిస్పందనల గురించి మాట్లాడాడు. అభిమానుల నుండి వచ్చిన అరుపుల వల్ల హార్దిక్ ప్రభావితం కాలేదని చావ్లా తెలిపాడు. హార్దిక్ కేవలం ఆటపైనే దృష్టి సారిస్తున్నాడు, ప్రేక్షకులు ఏమి చేస్తున్నారో కూడా అతను ఆందోళన చెందడు.. ఒకసారి విజయాలు సాధిస్తే, విషయాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పీయూష్ చెప్పుకొచ్చాడు.