తేలిపోయిన టీమిండియా బౌల‌ర్లు.. తొలి వన్డేలో ఓట‌మి..

Latham, Williamson Help NZ To A 7 Wicket Win. ఇండియా,న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2022 10:33 AM GMT
తేలిపోయిన టీమిండియా బౌల‌ర్లు.. తొలి వన్డేలో ఓట‌మి..

ఇండియా,న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత బౌలర్లు మరోసారి తేలిపోయారు. టీమిండియా పై కివీస్ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన పరుగుల 307 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో రెండు ఓవర్లు ఉండగానే చేధించింది. లాథమ్ (145 నాటౌట్) సెంచరీతో చెలరేగగా, విలియమ్సన్ (94 నాటౌట్) పరుగులతో రాణించాడు. కివీస్ 88 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయినప్పటికీ.. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ మూడు వన్డేల సిరీస్ ను ఓటమితో మొదలు పెట్టింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ (80), కెప్టెన్ శిఖర్ ధావన్ (72), శుభ్ మాన్ గిల్ (50) అర్ధసెంచరీలతో రాణించగా, వాషింగ్టన్ సుందర్ (37 నాటౌట్), సంజు శాంసన్ (36) పర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 3, సౌథీ 3, మిల్నే 1 వికెట్ తీశారు. 307 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని అందుకుంది. లాథమ్ 104 బంతుల్లో 145 పరుగులతో అద్భుత సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 5 సిక్సులు ఉన్నాయి. విలియమ్సన్ 98 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా, శార్దూల్ ఠాకూర్ 1 వికెట్ పడగొట్టాడు.


Next Story