విరాట్ మీద గెలిచిన బుమ్రా.!

IPL 2024లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి ముంబై ఇండియన్స్ పైన మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు

By Medi Samrat  Published on  11 April 2024 8:14 PM IST
విరాట్ మీద గెలిచిన బుమ్రా.!

IPL 2024లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి ముంబై ఇండియన్స్ పైన మ్యాచ్ లో తక్కువ పరుగులకే పెవిలియన్ కు చేరాడు. వాంఖడే స్టేడియంలో ఆర్సీబీ ఓపెనర్ కోహ్లీ పవర్‌ప్లేను ఉపయోగించుకోవడంలో విఫలమయ్యాడు. కోహ్లీ 9 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పేసర్ జస్ప్రీత్ బుమ్రా చేతిలో అవుట్ అయ్యాడు. కోహ్లి అవుట్ అవ్వడంతో వాంఖడే ప్రేక్షకులు నిరాశకు గురయ్యారు. 3వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చేతిలోకి వెళ్ళింది. బుమ్రా అద్భుతమైన బంతులతో అంతకు ముందు కోహ్లీని ఇబ్బంది పెట్టాడు. విరాట్ కోహ్లీ 2019 నుండి IPLలో జస్ప్రీత్ బుమ్రా చేతిలో అవుట్ అవ్వడం ఇది నాల్గవసారి.

ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆర్సీబీ ఐదు మ్యాచ్ లాడితే ఒకే మ్యాచ్ లో గెలిచింది. ముంబై ఇండియన్స్ నాలుగు మ్యాచ్ ల్లో ఒకటే గెలిచింది. ఆర్సీబీ జట్టులో గ్రీన్ స్థానంలో విల్ జాక్స్ ప్లేయింగ్ 11లో చేరాడు. ఆకాష్ దీప్, వైశుక్ లకు జట్టులో చోటు దక్కింది.

Next Story