సెంచరీ పూర్తీ చేసిన రాహుల్.. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఎంతంటే?

రాహుల్ సెంచరీ పూర్తీ చేశాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డుకున్నాడు.

By Medi Samrat  Published on  27 Dec 2023 9:29 AM GMT
సెంచరీ పూర్తీ చేసిన రాహుల్.. భారత్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు ఎంతంటే?

రాహుల్ సెంచరీ పూర్తీ చేశాడు. టీమిండియా-దక్షిణాఫ్రికా తొలి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభానికి కూడా వరుణుడు అడ్డుకున్నాడు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో ఆట ఆలస్యంగా మొదలైంది. మొదటిరోజు వర్షం కారణంగా ఆట 59 ఓవర్లే జరిగింది. చివరి సెషన్ లో వర్షం పడడంతో నిర్ణీత సమయం కంటే ముందే ఆట ముగిసింది. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కేఎల్ రాహుల్ 70 పరుగులతోనూ, మహ్మద్ సిరాజ్ పరుగులేమీ లేకుండా క్రీజులో ఉన్నారు.

రెండో రోజు వర్షం నిలిచిపోవడంతో రాహుల్ సెంచరీ బాదాడు. 137 బంతులు బ్యాటింగ్ చేసిన రాహుల్.. 101 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సర్లు.. 14 ఫోర్లు ఉన్నాయి. 67.4 ఓవర్ల పాటూ బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 245 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ బౌలర్ కగిసో రబాడా 5 వికెట్లతో సత్తా చాటగా, కొత్త బౌలర్ నాండ్రే బర్గర్ 3 వికెట్లు తీశాడు. మార్కో యన్సెన్, కొయెట్జీ చెరో వికెట్ తీశాడు. టీమిండియా ఇన్నింగ్స్ లో కోహ్లీ 38, శ్రేయాస్ అయ్యర్ 31, శార్దూల్ ఠాకూర్ 24 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (5), యశస్వి జైస్వాల్ (17), శుభ్ మాన్ గిల్ (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. టెయిలెండర్లతో కలిసి రాహుల్ భారత్ కు మంచి స్కోరును అందించాడు.

Next Story