ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి పురుషుల టీ20 ప్రపంచకప్-2022 ఫైనల్‌కు చేరుకుంది. ఇంగ్లండ్ ఓపెనింగ్ బ్యాటర్లు రెచ్చిపోయి ఆడటంతో.. 10 వికెట్ల తేడాతో టీం ఇంగ్లాండ్ మ్యాచ్‌ను గెలుచుకుంది. ఓపెనింగ్ జోడీ బట్లర్, అలెక్స్ హేల్స్ 170 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లాండ్‌ను టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్‌లో తలపడేందుకు సిద్ధం చేశారు. అంతకుముందు, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాలు అర్ధ సెంచరీలు చేయడంతో భారత్ 168/5 పరుగులు చేసింది. అలెక్స్ హేల్స్ 47 బంతుల్లో 86 నాటౌట్, జోస్ బట్లర్ 49 బంతుల్లో అజేయంగా 80 పరుగులు చేయడంతో 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 16 ఓవర్లలో ఛేదించింది. అంతకుముందు భారత ఇన్నింగ్సులో హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 63, విరాట్ కోహ్లి 50 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. అయితే తన నాలుగు ఓవర్ల కోటాలో 43 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.