బ్రాడ్‌పై విరుచుకుప‌డ్డ‌ బుమ్రా

Jasprit Bumrah Knocks Stuart Broad for 35 runs in a single over. ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది.

By Medi Samrat  Published on  2 July 2022 11:03 AM GMT
బ్రాడ్‌పై విరుచుకుప‌డ్డ‌ బుమ్రా

ఇంగ్లండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 416 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌(146), జడేజా(104) పరుగులతో రాణించారు. కెప్టెన్‌ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 16 బంతుల్లో 31పరుగులు సాధించాడు. బుమ్రా బ్యాటింగ్ చేస్తుంటే స్టువర్ట్ బ్రాడ్ కు ఏమి జరుగుతోందో కూడా అర్థం అవ్వలేదు. 4 Wd5 N6 4 4 4 6 1 ఇలా ఏకంగా 35 పరుగులు స్టువర్ట్ బ్రాడ్ ఇచ్చాడు. ఒక ఓవర్ లో టీ20ల్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ గా ఇప్పటికే రికార్డు సొంతం చేసుకున్న బ్రాడ్.. ఇప్పుడు టెస్టుల్లో కూడా అదే తరహా రికార్డును సొంతం చేసుకున్నాడు.

మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 416 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఇన్నింగ్స్ లో పంత్, రవీంద్ర జడేజాలు సెంచరీలతో కదం తొక్కారు. మొదటి రోజు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఏమాత్రం కలిసి రాలేదు. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. శుభమన్ గిల్ (17), పుజారా (13), హనుమ విహారి (20) తీవ్రంగా నిరాశ పరిచారు. కోహ్లీ 19 బంతులు ఆడిన విరాట్ 11 పరుగులు మాత్రమే చేసి మ్యాటీ పాట్స్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ 5 వికెట్లు, పొట్స్‌ 2 వికెట్లు,బ్రాడ్‌,రూట్‌,స్టోక్స్‌ తలా వికెట్‌ సాధించారు.


Next Story
Share it