బుమ్రా హాఫ్ సెంచరీ.. అతడి షాట్ కు విలవిలలాడిన ఆసీస్ బౌలర్

Jasprit Bumrah gets guard of honour for his maiden first-class 50. జస్ప్రీత్ బుమ్రాను భారత క్రికెట్ జట్టులో బౌలర్ గా సేవలు

By Medi Samrat
Published on : 11 Dec 2020 5:12 PM IST

బుమ్రా హాఫ్ సెంచరీ.. అతడి షాట్ కు విలవిలలాడిన ఆసీస్ బౌలర్

జస్ప్రీత్ బుమ్రాను భారత క్రికెట్ జట్టులో బౌలర్ గా సేవలు అందించడం మాత్రమే చూశాం. అంతేకానీ బ్యాట్స్మెన్ గా దుమ్ము దులపడం ఎప్పుడూ చూడలేదు. తాజాగా బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగిపోయాడు. హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. తన ఫస్ట్ క్లాస్ చరిత్రలో మొదటి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.

ఆస్ట్రేలియా-'ఎ'తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బుమ్రా అర్థ శతకం నమోదు చేశాడు. తొలి రోజు ఆటలో భాగంగా భారత్‌ టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. పృథ్వీ షా(40), శుబ్‌మన్‌ గిల్‌(43) రాణించారు. టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిన సమయంలో బుమ్రా, మొహమ్మద్ సిరాజ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి 71 పరుగులు జత చేసింది. సదర్‌లాండ్‌ బౌలింగ్‌ సిక్స్‌ కొట్టి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రా హాఫ్‌ సెంచరీ సాధించిన కాసేపటికి సిరాజ్‌(22) పదో వికెట్‌గా ఔట్‌ కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌ ముగిసింది. బుమ్రా 57 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. భారత్‌ జట్టు 48. 3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌'ఎ' బౌలర్లలో అబాట్‌, వైడ్‌మత్‌లు తలో మూడు వికెట్లు తీసుకున్నారు. కాన్వే, సదర్లాండ్‌, గ్రీన్‌, స్వెప్సన్‌లకు వికెట్‌ చొప్పున లభించింది.



బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆడిన షాట్ కు ఆసీస్ బౌలర్ విలవిలలాడాడు. బుమ్రా కామెరాన్ గ్రీన్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. ఆ షాట్‌ పొరపాటున గ్రీన్‌ తలకు బలంగా తాకింది. దీంతో నొప్పితో విలవిల్లాడిన గ్రీన్‌ పిచ్‌లోనే కూలబడ్డాడు. దీంతో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న మహ్మద్‌ సిరాజ్ తన బ్యాట్‌ను పడేసి పరుగు పూర్తి చేయకుండా అతని వద్దకు పరిగెత్తాడు. అతడిని ఫిజియో వచ్చి చూశాడు. అతడికి ఏమీ అవ్వకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






Next Story