బ్యాటింగ్‌లో విఫలం.. ఓటమి ముంగిట టీమిండియా..!

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది.

By -  Medi Samrat
Published on : 24 Nov 2025 6:03 PM IST

బ్యాటింగ్‌లో విఫలం.. ఓటమి ముంగిట టీమిండియా..!

గౌహతి వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో సఫారీ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు కేవలం 201 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికాకు 288 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌ను దక్షిణాఫ్రికా పేసర్ మార్కో యన్సెన్ చావుదెబ్బ తీశాడు. కేవలం 48 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగట్టి భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను పతనం చేశాడు. స్పిన్నర్ సైమన్ హార్మర్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ ఒక వికెట్ తీశారు. భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (58), ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (48) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19) వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా పోరాడారు.

అంతకుముందు, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆల్‌రౌండర్ సెనురన్ ముత్తుసామి (109) అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకోగా, మార్కో యన్సెన్ (93) రాణించాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత్ కు ఫాలో ఆన్ ఇవ్వకుండా దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది.

Next Story