జైస్వాల్ డబుల్ సెంచరీ చేసేనా.?

భారత జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు.

By Medi Samrat  Published on  2 Feb 2024 11:42 AM GMT
జైస్వాల్ డబుల్ సెంచరీ చేసేనా.?

భారత జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ విశాఖ టెస్టులో డబుల్ సెంచరీ దిశగా దూసుకెళుతున్నాడు. రెండో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడికి తోడుగా రవిచంద్రన్ అశ్విన్ 5 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తం 257 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 17 ఫోర్లు, 5 సిక్సులు కొట్టాడు. తొలి రోజు ఆట చివరికి మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 6 వికెట్లకు 336 పరుగులు చేసింది.

ఈ ఉదయం టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్ గా వచ్చిన జైస్వాల్ ఆఖరు వరకూ క్రీజులో నిలిచాడు. మరో ఎండ్ లో, ఇతర బ్యాట్స్ మెన్ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమవుతూ వచ్చారు. అనవసరంగా వికెట్లను భారత ఆటగాళ్లు పారేసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 14, శుభ్ మాన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27, రజత్ పాటిదార్ 32, అక్షర్ పటేల్ 27, కేఎస్ భరత్ 17 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 2, రెహాన్ అహ్మద్ 2, ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1 వికెట్ తీశారు. రెండో రోజు భారత్ భారీ స్కోరు చేయాలంటే మాత్రం జైస్వాల్ కు అశ్విన్ అండగా నిలవాల్సి ఉంటుంది.

Next Story