ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?

వరుసగా కివీస్ చేతుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత జట్టు ముంబై టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది

By Medi Samrat  Published on  1 Nov 2024 10:40 AM GMT
ముంబైలో అయినా విజయం సాధిస్తారా.?

వరుసగా కివీస్ చేతుల్లో రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన భారత జట్టు ముంబై టెస్ట్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని భావిస్తోంది. సిరీస్ కోల్పోయినప్పటికీ ఆఖరి మ్యాచ్ లో గెలిచి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరడానికి పాయింట్లు సాధించాలని భారత్ భావిస్తోంది.

ముంబై టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. రవీంద్ర జడేజా 5 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో చెలరేగడంతో 235 పరుగులకే కివీస్ ఆలౌట్ అయింది. మరో వికెట్ పేసర్ ఆకాశ్ దీప్‌కు దక్కింది. 82 పరుగులు చేసిన డారిల్ మిచెల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లలో విల్ యంగ్ 71, టామ్ లాథమ్ 28 రాణించారు. డెవాన్ కాన్వే 4, రచిన్ రవీంద్ర 5, టామ్ బ్లండెల్ 0, గ్లెన్ ఫిలిప్స్ 17, ఇష్ సోధి 7, మ్యాట్ హెన్రీ 0, అజాజ్ పటేల్ 7, విలియం ఒరూర్కే 1 (నాటౌట్) పరుగులుమాత్రమే చేశారు. ఇక మొదటి ఇన్నింగ్స్ లో భారత్ కు మొదటి లోనే షాక్ తగిలింది. 25 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.

Next Story