ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?

ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం అంచున నిలుచుంది. అయితే కివీస్ బౌలర్లు అద్భుతం చేస్తే భారత్ కు ఊహించని షాక్ తప్పదు

By Medi Samrat  Published on  2 Nov 2024 9:15 PM IST
ఈ మ్యాచ్‌ను అయినా విజయంతో ముగిస్తారా.?

ముంబై టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం అంచున నిలుచుంది. అయితే కివీస్ బౌలర్లు అద్భుతం చేస్తే భారత్ కు ఊహించని షాక్ తప్పదు. మూడో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియాదే పైచేయిగా నిలిచింది. కివీస్ తన రెండో ఇన్నింగ్స్ లో 9 వికెట్లకు 171 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్ ఆధిక్యం కేవలం 143 పరుగులే. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3, ఆకాశ్ దీప్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.

కివీస్ ఇన్నింగ్స్ లో విల్ యంగ్ 51 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. గ్లెన్ ఫిలిప్స్ 26, ఓపెనర్ డెవాన్ కాన్వే 22, డారిల్ మిచెల్ 21 పరుగులు చేశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్ లో 235 పరుగులు చేయగా.. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులు చేసి, 28 పరుగుల ఆధిక్యం అందుకుంది. మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లు భారతజట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ముంబై టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు మొదటి సెషన్ లో భారత్ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Next Story