ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు..టాప్‌ 5కి చేరుకున్న ఇషాన్ కిషన్

ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు.

By -  Knakam Karthik
Published on : 25 Feb 2026 5:07 PM IST

Sports News, Cricket News, ICC Rankings, T20, Abhishek Sharma, Ishan Kishan, Team India

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు..టాప్‌ 5కి చేరుకున్న ఇషాన్ కిషన్

ఐసీసీ తాజాగా ప్రకటించిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు దుమ్మురేపారు. టీ20 ప్రపంచకప్‌లో ఆరంభంలో కాస్త నెమ్మదించినప్పటికీ, యువ ఓపెనర్ అభిషేక్ శర్మ తన నంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ కంటే 62 పాయింట్ల ఆధిక్యంతో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మూడు స్థానాలు ఎగబాకి ఐదో ర్యాంకుకు చేరుకోవడం విశేషం. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ మూడో స్థానానికి చేరుకోగా, సౌత్ ఆఫ్రికా యంగ్ సెన్సేషన్ డెవాల్డ్ బ్రెవిస్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 9వ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

ఆల్ రౌండర్ల విభాగంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకోగా, భారత్ నుంచి శివమ్ దూబే ఏడో స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, జస్‌ప్రీత్ బుమ్రా ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి మూడో ర్యాంకులో నిలిచారు. మొత్తంమీద బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Next Story