IPL-2024: డ్రెస్సింగ్ రూమ్‌లో కంటతడి పెట్టిన రోహిత్ (వీడియో)

వాంఖడే స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ టీమ్‌లు తలపడ్డాయి.

By Srikanth Gundamalla  Published on  7 May 2024 1:11 PM IST
ipl-2024, cricket, Rohit sharma, cry, viral video,

IPL-2024: డ్రెస్సింగ్ రూమ్‌లో కంటతడి పెట్టిన రోహిత్ (వీడియో)

వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌ టీమ్‌లు తలపడ్డాయి. ఈమ్యాచ్‌లో ముంబై టీమ్‌ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఈ పోరులో గెలిచింది. కాగా..ఈ మ్యాచ్‌ సందర్భంగా ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కంటతడి పెట్టారు. డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని బాధతో ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 30 బంతుల్లో 48 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ కమిన్స్‌ 17 బంతుల్లో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పీయూష్ చావ్లా 3 వికెట్లు తీశారు. 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. సూర్య కుమార్‌ యాదవ్‌ సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. 51 బంతుల్లో 102 పరుగులు చేశాడు స్కై.

కాగా ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. 5 బంతులను ఎదుర్కొని 4 పరుగులు చేశాడు. కమిన్స్ బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లిన హిట్‌మ్యాచ్‌ త్వరగా ఔట్‌ కావడంతో కుమిలిపోయాడు. ఏమైందో తెలియదు కానీ.. రోహిత్‌ శర్మ ఒక్కసారిగా కంటతడి పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫామ్‌ కోల్పోయాననే బాధతోనే రోహిత్‌ ఏడ్చాడని అంటున్నారు. ఇక ఇంకొందరు హిట్‌మ్యాన్‌ను విమర్శిస్తున్నారు. అభిమానులు మాత్రం.. ఆటలో ఇదంతా సహజం అని హిట్‌మ్యాన్‌ అంటే ఏంటో అందరికీ తెలుసంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Next Story