10 రోజుల గ్యాప్ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ జట్టుతో మూడో టెస్ట్ మ్యాచ్ లో తలపడనుంది. మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన విరాట్ కోహ్లీ.. సిరీస్ లో మిగిలిన మ్యాచ్ లకు కూడా దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. చివరి మూడు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. ఈ టెస్టులకు దూరంగా ఉండాలని కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడు. కోహ్లీ నిర్ణయంపై బీసీసీఐ సెక్రటరీ జే షా స్పందిస్తూ కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని చెప్పారు. టెస్ట్ సిరీస్ లో జట్టులోని ఇతర ఆటగాళ్ల సమర్థ్యాలపై టీమ్ మేనేజ్ మెంట్ కు, బోర్డుకు నమ్మకం ఉందని తెలిపారు.
అన్ని ఊహాగానాలకు ముగింపు పలుకుతూ, విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో మిగిలిన మూడు టెస్టుల నుండి వైదొలుగుతున్నట్లు BCCI అధికారులు, సెలక్షన్ కమిటీ, భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేసినట్లు సమాచారం. ఇదే కారణంతో హైదరాబాద్, విశాఖపట్నంలలో జరిగిన తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరమయ్యాడు. మూడు, నాల్గవ టెస్ట్‌ల నుండి కోహ్లి దూరంగా ఉండబోతున్నాడని గతంలోనే వార్తలు రాగా.. ఇప్పుడు కోహ్లీ జర్నీకి సంబంధించి ఓ నిర్ణయం వచ్చేసింది.