భారత ఫుట్‌బాల్ దిగ్గజం సుభాస్ భౌమిక్ కన్నుమూత‌

India’s football great Subhas Bhowmick passes away at 71. భారత ఫుట్‌బాల్ దిగ్గజం సుభాస్ భౌమిక్ (71) కన్నుమూశారు. 1970 బ్యాంకాక్‌లో జరిగిన

By Medi Samrat  Published on  22 Jan 2022 6:49 AM GMT
భారత ఫుట్‌బాల్ దిగ్గజం సుభాస్ భౌమిక్ కన్నుమూత‌

భారత ఫుట్‌బాల్ దిగ్గజం సుభాస్ భౌమిక్ (71) కన్నుమూశారు. 1970 బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా గేమ్స్‌లో కాంస్యం గెలిచిన జట్టులో సభ్యుడైన భారత ఫుట్‌బాల్ దిగ్గ‌జం సుభాస్ భౌమిక్, 71 సంవత్సరాల వయసులో శనివారం ఉద‌యం కోల్‌కతాలో కన్నుమూశారు. అక్టోబరు 2, 1950న జన్మించిన భౌమిక్.. జూలై 30, 1970న ఫర్మోసాతో జరిగిన మెర్డెకా కప్‌లో భారతదేశం తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను 24 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి తొమ్మిది గోల్స్ చేశాడు. 1971లో మెర్డెకా కప్‌లో ఫిలిప్పీన్స్‌పై భౌమిక్ హ్యాట్రిక్‌తో రాణించ‌డంతో ఈ మ్యాచ్‌లో భారత్‌ 5-1తో గెలిచింది. అనంత‌రం ఎన్నో అగ్రశ్రేణి టోర్నమెంట్లలో దేశం త‌రుపున పాల్గొన్న భౌమిక్.. జాతీయ జట్టుకు కోచ్‌గా కూడా ఉన్నాడు.

దేశవాళిలో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు భౌమిక్. 1968, 1969, 1970, 1971, 1972, 1973 సీజ‌న్‌ల‌లో కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు. ప్ర‌తిష్టాత్మ‌క‌ సంతోష్ ట్రోఫీ నాలుగుసార్లు (1969, 1971,1972, 1972) గెల‌వ‌డంలో భౌమిక్ కీల‌క భూమిక పోషించారు. భౌమిక్ 1970, 1971, 1972, 1976, 1977, 1978లో మోహన్ బగాన్ తరఫున ఆడాడు. ఆ స‌మ‌యంలో అత్య‌ధికంగా 84 గోల్స్ చేశాడు. అతను అంతకుముందు 1968లో కోల్‌కతాలోని రాజస్థాన్ క్లబ్‌తో తన క్లబ్ కెరీర్‌ను ప్రారంభించాడు.. అందులో ఆయ‌న‌ కలకత్తా ఫుట్‌బాల్ లీగ్‌లో ఏడు గోల్స్ చేశాడు. భౌమిక్ అనేక అవార్డులను గెలుచుకున్న ఒక ప్రసిద్ధ కోచ్ కూడా. అతను 1989లో ఢాకాలో జరిగిన 7వ ప్రెసిడెంట్ గోల్డ్ కప్‌లో భారతదేశానికి కోచ్‌గా పనిచేశాడు.

సుభాస్ భౌమిక్ మృతిప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తన సంతాప సందేశంలో "తన తరంలో గొప్ప ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన భౌమిక్ డా ఇక లేరనే వార్త వినడం బాధాకరం. భారత ఫుట్‌బాల్‌కు ఆయన అందించిన అమూల్యమైన సహకారం ఎప్పుడూ మనతోనే ఉంటుంది మరియు ఎప్పటికీ మరువలేనిది. భారత ఫుట్‌బాల్ మరింత పేలవంగా మారింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. నేను బాధను పంచుకుంటున్నాను. " అని రాసుకొచ్చారు.

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుశాల్ దాస్ మాట్లాడుతూ.. "Mr. సుభాస్ భౌమిక్ తన విజయాలతో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటాడు. అతను ఒక లెజెండరీ ఫుట్‌బాల్ ఆటగాడు మరియు దూరదృష్టి గల కోచ్ - చాలా తరాలకు స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. అతని ఆత్మకు శాంతి చేకూరల‌ని అన్నారు.


Next Story