మెరిసిన రో'హిట్‌'.. తొలి వన్డేలో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

India's 10-Wicket Win Over England. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం లండన్‌లోని కెన్నిగ్టన్

By Medi Samrat  Published on  12 July 2022 4:34 PM GMT
మెరిసిన రోహిట్‌.. తొలి వన్డేలో టీమిండియా సూప‌ర్ విక్ట‌రీ

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం లండన్‌లోని కెన్నిగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. రోహిత్ శర్మ 58 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేయ‌గా.. శిఖర్ ధావన్ 31 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిల‌వ‌డంతో 111 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది.

అంతకుముందు.. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు తీసి వన్డేల్లో తన కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేయగా.. మహ్మద్ షమీ 3 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ తీయ‌డంతో భారత్ ఇంగ్లండ్‌ను 110 పరుగులకే కట్టడి చేసింది. టాస్ గెలిచిన రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా విరాట్ కోహ్లి ఈ వ‌న్డేకు దూరమయ్యాడు. బౌల‌ర్‌ అర్ష‌దీప్ సింగ్ కూడా పొత్తికడుపులో నొప్పి కారణంగా ప్లేయింగ్ లెవ‌న్‌కు అందుబాటులో లేడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.










Next Story