వర్షం కారణంగా ఫైనల్ రద్దు.. అయినా భారత్‌కు బంగారు పతకం..!

ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది.

By Medi Samrat  Published on  7 Oct 2023 10:15 AM GMT
వర్షం కారణంగా ఫైనల్ రద్దు.. అయినా భారత్‌కు బంగారు పతకం..!

ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల క్రికెట్ జట్టు స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఆసియా క్రీడలు 2023లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగాల్సిన ఫైన‌ల్‌ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఆఫ్ఘనిస్థాన్‌ కంటే ఎక్కువ సీడ్‌ కావడంతో భారత్‌ విజేతగా నిలిచింది. దీంతో అఫ్గానిస్థాన్ జట్టు రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఆఫ్ఘనిస్తాన్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌ జరగలేదు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ఆధారంగా భారత్‌ను విజేతగా ప్రకటించారు. ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా మొదటి స్థానంలో ఉంది. కాగా, ఆఫ్ఘనిస్థాన్ 10వ స్థానంలో ఉంది.

అంతకుముందు మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్ డిఎల్‌ఎస్ పద్ధతిలో 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

Next Story