కెప్టెన్‌గా భారీ ఫీట్ సాధించిన‌ రోహిత్

ఛాంపియ‌న్స్‌ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది.

By Medi Samrat  Published on  13 Feb 2025 7:49 AM IST
కెప్టెన్‌గా భారీ ఫీట్ సాధించిన‌ రోహిత్

ఛాంపియ‌న్స్‌ ట్రోఫీ 2025కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. భారత్ మూడో మ్యాచ్‌లో 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ భారీ ఫీట్ సాధించాడు. రోహిత్ టీమిడియా అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కూడా దాటాడు.

3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో అత్యధిక సార్లు ప్రత్యర్థులను మట్టికరిపించిన భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఇప్పటి వరకు 4 సార్లు ఈ ఘనత సాధించాడు. అంతకుముందు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌ల‌లో ప్రత్యర్థి జట్టును 3-3 సార్లు క్లీన్ స్వీప్ చేశారు. ఇది మాత్రమే కాదు. వన్డే ఫార్మాట్‌లో 4 వేర్వేరు ప్రత్యర్ధి జ‌ట్ల‌ను వైట్‌వాష్ చేసిన మొదటి భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.

రోహిత్ కెప్టెన్సీలో 2022లో వెస్టిండీస్‌ను 3-0తో ఓడించాడు. దీని తర్వాత హిట్‌మ్యాన్ సారథ్యంలోని భారత జట్టు 2023లో శ్రీలంక, న్యూజిలాండ్‌లను వన్డే సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు మ్యాన్ ఇన్ బ్లూ ఇంగ్లీష్ జట్టును తుడిచిపెట్టేసింది.

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్‌పై వన్డేల్లో భారత్‌కు ఇది రెండో అతిపెద్ద విజయం. గ‌తంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో భారత్ 158 పరుగుల తేడాతో అతిపెద్ద విజయం సాధించింది. 2008లో రాజ్‌కోట్‌లో భారత జట్టు ఈ విజయాన్ని నమోదు చేసింది.

ఇంగ్లండ్‌తో వన్డేలో భారత్‌కు అతిపెద్ద విజయాలు

158 పరుగులు: రాజ్‌కోట్, 2008

142 పరుగులు: అహ్మదాబాద్, 2025

133 పరుగులు: కార్డిఫ్, 2014

127 పరుగులు: కొచ్చి, 2013

126 పరుగులు: హైదరాబాద్, 2011

Next Story