రోహిత్ నిర్ణయాలే ఈ పరిస్థితికి కారణమట..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది.
By Medi Samrat Published on 27 Dec 2024 3:24 PM ISTబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. భారత జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 164 పరుగులకే సగం మంది జట్టు పెవిలియన్‌కు చేరింది. టీమిండియా ఈ పరిస్థితికి కెప్టెన్ రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలే కారణమని భావిస్తున్నారు.
నాలుగో టెస్టు కోసం భారత్ ప్లేయింగ్ 11లో ఒక మార్పు జరిగింది. శుభ్‌మన్ గిల్‌ను తప్పించి ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశం ఇచ్చారు. దీంతో భారత బ్యాటింగ్ బలహీనపడింది. భారత్ 5 వికెట్లు కోల్పోయింది. దీంతో జట్టుపై ఫాలోఆన్ ముప్పు పొంచి ఉంది. భారత్ ఇంకా 310 పరుగులు వెనుకబడి ఉంది.
ఇది మాత్రమే కాదు గత 2 టెస్టుల్లో 6వ స్థానంలో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఆర్డర్‌ను కూడా మార్చాడు. నాలుగో టెస్టులో యశస్వి జైస్వాల్‌తో కలిసి రోహిత్ ఓపెనింగ్ చేశాడు. దీంతో KL రాహుల్ 3వ స్థానంలో రావాల్సివచ్చింది.
బ్యాటింగ్ ఆర్డర్ మార్చిన తర్వాత కూడా రోహిత్ శర్మ విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5 బంతుల్లో 3 పరుగులు చేశాడు. 6వ స్థానంలో కాకుండా ఓపెనింగ్ చేస్తే ఫలితం సాధించవచ్చని రోహిత్ భావించాడు. అయితే ఇది తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచాడు.
కేఎల్ రాహుల్ స్థానాన్ని తారుమారు చేయడంతో అతడు కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రాహుల్ 42 బంతుల్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. అతడిని పాట్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. కెఎల్ రాహుల్ తొలి టెస్టులో 84-4*, రెండో టెస్టులో 37-7, మూడో టెస్టులో 26-77 పరుగులతో రాణించాడు. దీంతో రోహిత్ నిర్ణయాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.