ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత అమ్మాయిలు

ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా నిలిచింది.

By Knakam Karthik  Published on  2 Feb 2025 3:27 PM IST
Sports News, U19 World Cup, Team India, South Africa, Bcci

ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత అమ్మాయిలు

ఉమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత అమ్మాయిలు వండర్ క్రియేట్ చేశారు. అండర్-19 టీ 20 ప్రపంచ కప్ ఛాంపియన్‌గా టీమ్ ఇండియా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి మ్యాచ్‌ను గెలిచారు. మొత్తంగా 11.2 ఓవర్లలోనే ఫైనల్ మ్యాచ్‌ను అవలీలగా ఛేదించి విశ్వ విజేతగా మహిళల టీమ్ నిలిచింది.

కాగా, తుదిపోరులో టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా సరిగ్గా 20 ఓవర్లలో కేవలం 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో గొంగడి త్రిష 3, వైష్టవి శర్మ 2, ఆయుషి శుక్లా 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు. 83 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి విశ్వవిజేతగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో త్రిష 44 పరుగుల చేయగా, సానిక 26 పరుగలు చేసింది. మరో బ్యాటర్ కమలిని ఎనిమిది పరుగులే చేసి ఔటయ్యింది.

మరోసారి తెలంగాణలోని భద్రాచలానికి చెందిన గొంగిడి త్రిష రాణించింది. ఓపెనర్ గొంగడి త్రిష తన ఆల్‌ రౌండ్ ఆటతో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత్‌ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ మరోసారి కప్ సాధించడంతో అభిమానులు ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Next Story