టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత్ తో న్యూజిలాండ్ తలపడుతుంది. పాకిస్తాన్ తో భారీ ఓటమి అనంతరం భారత్ ఈ మ్యాచ్ లో పుంజుకోబోతోందని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. అయితే భారత అభిమానులను ఓ అంశం తెగ కలవర పెడుతోంది. సెమీస్ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌తో తప్పకుండా గెలవాలి. అయితే భారత్ గత 18 ఏళ్లుగా ఐసీసీ టోర్నీల్లో కివీస్ ను ఓడించలేదట..! 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్.. 2021 టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. గత రెండు ఐసీసీ టోర్నీలలో న్యూజిలాండ్ జట్టు భారత్ కు షాక్ లు ఇచ్చింది. గత టీ-20 ప్రపంచకప్‌లో టీమిండియాను కివీస్ ఓడించింది. అందుకే కివీస్ తో ఐసీసీ టోర్నమెంట్ మ్యాచ్ భారత్ ను తెగ ఆందోళన పెడుతోంది.
ఐసీసీ టోర్నీలలో ఫలితాలు ఎలా ఉన్నా మొత్తంగా టీ20 లలో చూసుకున్నా కివీస్ దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు 16 సార్లు తలపడ్డాయి. అందులో 6 భారత్ గెలువగా.. 8 మ్యాచ్ లు కివీస్ వశమయ్యాయి. 2 మ్యాచ్ లలో ఫలితం తేలలేదు. కానీ.. ఇరు జట్ల మధ్య జరిగిన ఆఖరు 5 టీ20లలో భారత్ దే విజయం కావడంతో భారత అభిమానులు అదే ఫలితం వస్తే బెటర్ అని భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం భారత్ 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 48 పరుగులకు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(18), ఇషాన్ కిషన్(4), వన్ డౌన్‌లో వచ్చిన రోహిత్(14) విఫలమయ్యారు.