వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. వరుణుడి ఎంట్రీ ఉంటుందా

India vs New Zealand WTC Final Southampton weather forecast. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో

By Medi Samrat  Published on  17 Jun 2021 11:09 AM GMT
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్.. వరుణుడి ఎంట్రీ ఉంటుందా

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కోసం భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక వర్షం ఎక్కడ మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తుందో అనే భయం కూడా క్రికెట్ అభిమానులను వెంటాడుతూ ఉంది. వర్షం అంతరాయాలు లేకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్న అభిమానులకు ఆ రోజుల్లో వర్షం పడే అవకాశం ఉందని వార్తలు రావడం.. వాతావరణ శాఖ కూడా వర్షం పడే అవకాశం ఉందని చెబుతూ ఉండడంతో 'సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో' రిజర్వ్ రోజు కూడా మ్యాచ్ ఆడాల్సి రావచ్చు.

వాతావరణ సూచన ప్రకారం ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షం, ఉదయం వర్షం, ఆట యొక్క అన్ని రోజులలో వర్షం పడే అవకాశం ఉందట..! ఇది గ్రౌండ్‌మెన్‌లకు చాలా పని పెడుతుందని అంటున్నారు. Accueather.com నుండి వాతావరణ సూచన ప్రకారం, జూన్ 19, జూన్ 20, జూన్ 22 న వర్షం పడే అవకాశం ఉంది. జూన్ 18, జూన్ 21 న పెద్దగా ఎండ ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇక రిజర్వ్ రోజున కూడా వర్షం ఆటకు అంతరాయం కలిగిస్తుందని భావిస్తున్నారు.

డబ్ల్యుటిసి ఫైనల్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతోందో స్క్రీన్ షాట్‌ను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ షేర్ చేశారు. ఐదు రోజులలో కోల్పోయిన సమయాన్ని ఇతర రోజులలో అదనపు సమయంలో ఆడకుండా కవర్ చేయలేకపోతే రిజర్వ్ రోజు అమలులోకి వస్తుంది. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీని ఇరు జట్లు పంచుకుంటాయి.



Next Story