భారత్ మ్యాచ్ బుల్లి తెరపై భారీ హిట్..!
India vs New Zealand final most watched across WTC series. భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లంటే భారీగా వ్యూవర్ షిప్ ఉంటుందన్నది తెలిసిందే..!
By Medi Samrat Published on 28 July 2021 4:18 PM ISTభారత్ ఆడే క్రికెట్ మ్యాచ్ లంటే భారీగా వ్యూవర్ షిప్ ఉంటుందన్నది తెలిసిందే..! అలాంటిది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భారత్ ఉంటే వ్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..! తొలి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ముగిసి నెల రోజులైంది. తొలి సీజన్ రెండేళ్ల పాటు సాగింది. ఇందులో భాగంగా జరిగిన అన్ని సిరీస్‌ల కంటే ఎక్కువగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వ్యూవర్‌షిప్ వచ్చినట్లు తాజాగా ఐసీసీ వెల్లడించింది.
దేశంలో స్టార్‌స్పోర్ట్స్, దూర్‌దర్శన్ ఈ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్‌ను 17.7 కోట్ల మంది చూశారు. లైవ్ వ్యూవర్లు అయితే గరిష్ఠంగా 13.06 కోట్లకు చేరుకుందట..! ఇందులో 94.6 శాతంతో భారత్ లోనే ఎక్కువ వ్యూవర్లను అందించింది. ఈ ఫైనల్‌కు వచ్చిన వ్యూవర్‌షిప్‌పై ఐసీసీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అనురాగ్ దహియా ఆనందం వ్యక్తం చేశారు. న్యూజిలాండ్‌లోనూ ఈ మ్యాచ్‌కు మంచి ఆదరణ లభించడం విశేషం. ఆ దేశ జనాభా, వాళ్లకు మ్యాచ్ ప్రసారమైన సమయం (రాత్రి వేళ) అనుకూలించకపోయినా సుమారు 2 లక్షల మంది రాత్రంతా మెలుకవగా ఉండి ఈ మ్యాచ్ చూశారు.
ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనూ మంచి వ్యూవర్‌షిప్ వచ్చింది. ఐసీసీ.టీవీలో 6.65 లక్షల లైవ్ వ్యూస్ రాగా.. మొత్తంగా ఐసీసీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో 50 కోట్ల మంది ఈ మ్యాచ్ చూశారు. ఏది ఏమైనా భారత్ మ్యాచ్ లకు బుల్లి తెరపై భారీ డిమాండ్ ఉంటుందని మరోసారి రుజువైంది. అదీ కాకుండా వర్షం అంతరాయం లాంటివి ఫైనల్ మ్యాచ్ కు చాలానే ఇబ్బందులు పెట్టాయి. దాని వలన కూడా కాస్త వ్యూవర్ షిప్ తగ్గి ఉంటుంది.