పాకిస్థాన్‌లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ లో భారత్ పాల్గొనడంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా దశాబ్ద కాలంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకూడదని భారత ప్రభుత్వం కఠినమైన వైఖరిని కొనసాగిస్తూ ఉంది.
అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) భారతజట్టును ఎలాగైనా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్ కు తీసుకుని రావాలని అనుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలో ఓ విచిత్రమైన పరిష్కారంతో ముందుకు వచ్చిందని క్రిక్ బజ్ నివేదించింది. "భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌లో ఉండాల్సిన అవసరం లేదని, భారత జట్టు ప్రతి గేమ్ తర్వాత చండీగఢ్ లేదా న్యూఢిల్లీకి తిరిగి వెళ్లవచ్చు" అని పీసీబీ బీసీసీఐకి లేఖ రాసిందని నివేదిక పేర్కొంది.