T20 World Cup Squad : షాకింగ్.. జట్టులో స్థానం కోల్పోయిన శుభ్‌మన్ గిల్..!
T20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఈరోజు ప్రకటించింది.
By - Medi Samrat |
T20 ప్రపంచ కప్ 2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సెలక్షన్ కమిటీ ఈరోజు ప్రకటించింది. ఇది కాకుండా, న్యూజిలాండ్ పర్యటన కోసం కూడా భారత జట్టును ప్రకటించింది. రెండు జట్లు దాదాసు ఒకటే. ఫామ్‌తో సతమతమవుతున్న సూర్యకుమార్ యాదవ్ జట్టు బాధ్యతలు చేపట్టనున్నాడు.
అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీని అప్పగించారు. అంతకుముందు, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సహా సెలెక్టర్లందరితో ముంబైలో సమావేశం జరిగింది. బీసీసీఐ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025లో అద్భుత ప్రదర్శన చేసిన ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో పాటు ఫినిషర్ రింకూ సింగ్‌కు కూడా జట్టులో అవకాశం దక్కింది. ఫామ్‌తో సతమతమవుతున్న శుభ్‌మన్ గిల్‌ను జట్టు నుంచి తప్పించారు. దీంతో పాటు వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా జట్టులో స్థానం కోల్పోయాడు. అక్షర్ పటేల్‌కు మళ్లీ వైస్ కెప్టెన్సీ దక్కింది.
T20 ప్రపంచ కప్ 7 ఫిబ్రవరి 2026 నుండి ప్రారంభమవుతుంది, చివరి మ్యాచ్ మార్చి 8 న జరుగుతుంది. ఈ టోర్నీలో 20 జట్ల మధ్య పోరు జరగనుంది. అన్ని జట్లను 5 చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. 2024లో జరిగిన ప్రపంచకప్‌లో భారత జట్టు విజేతగా నిలిచింది.
ప్రపంచ కప్-న్యూజిలాండ్ పర్యటన కోసం భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).