భారత జట్టు ప్రకటన.. సిరాజ్, జడ్డూ, రాహుల్ వచ్చేశారు.. ఎవరు అవుట్ అంటే?

ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై భారతజట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడుతూ ఉంది. సిరీస్ హోరాహోరీగా సాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  10 Feb 2024 8:10 AM GMT
భారత జట్టు ప్రకటన.. సిరాజ్, జడ్డూ, రాహుల్ వచ్చేశారు.. ఎవరు అవుట్ అంటే?

ఇంగ్లాండ్ తో సొంత గడ్డపై భారతజట్టు ఐదు టెస్టుల సిరీస్ ఆడుతూ ఉంది. సిరీస్ హోరాహోరీగా సాగుతూ ఉంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలిస్తే.. వైజాగ్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఇంగ్లండ్ ను చావు దెబ్బ కొట్టింది. అయితే మూడో టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 15 నుండి మొదలవ్వనుంది. ఈ తరుణంలో చివరి మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ లు జట్టుకు దూరమయ్యారు. విరాట్ కోహ్లీ మొదటి రెండు టెస్ట్ మ్యాచ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మూడు టెస్ట్ మ్యాచ్ లకు పుజారాను సెలెక్ట్ చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ భారత జట్టులోకి తిరిగి వచ్చాయి. వారు మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడంతో తిరిగి భారత జట్టులో భాగమయ్యారు.

ఇండియా టెస్ట్ స్క్వాడ్:

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురేల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, సిరాజ్, ముఖేశ్ కుమార్, ఆకాశ్ దీప్.

విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టు నుంచి విశ్రాంతి తీసుకున్న మహ్మద్ సిరాజ్‌కు జట్టులో చోటు దక్కింది. ముఖేష్ కుమార్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా, అవేష్ ఖాన్ స్థానంలో, సెలక్షన్ కమిటీ ఆకాష్ దీప్‌ను ఎంపిక చేసింది. జడేజా తిరిగి రావడంతో సౌరభ్ కుమార్ కూడా జట్టు నుండి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం 1-1తో ఉన్న సిరీస్‌లో మూడో టెస్టు ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ప్రారంభం కానుంది.

Next Story