WTC Standings : వెస్టిండీస్‌పై న్యూజిలాండ్ భారీ విజయం.. మరింత దిగజారిన టీమిండియా పరిస్థితి..!
వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
By - Medi Samrat |
వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌ను 278/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ 128 పరుగులకే కుప్పకూలడంతో కివీస్ జట్టు 56 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వెల్లింగ్టన్‌లో విజయంతో న్యూజిలాండ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్‌కు చేరుకోవాలనే తమ ఆశలను బలోపేతం చేసుకుంది. రెండో టెస్టులో నెగ్గిన న్యూజిలాండ్‌కు 12 పాయింట్లు లభించాయి. తాజాగా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ జట్టు మూడో స్థానానికి చేరుకుంది.
ప్రస్తుత WTC సైకిల్‌లో న్యూజిలాండ్ 2 మ్యాచ్‌లు గెలిచి 1 మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఈ విధంగా కివీస్ 16 పాయింట్లు సాధించగా.. 66.67 విన్నింగ్ పర్సంటేజ్. ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుతం 5 మ్యాచ్‌ల్లో 5 విజయాలు నమోదు చేసి WTC పాయింట్లలో అగ్రస్థానంలో ఉంది. కంగారూ జట్టుకు 60 పాయింట్లు ఉండగా, విజయాల శాతం 100 పర్సంటేజ్ .
దక్షిణాఫ్రికా జట్టు రెండో స్థానంలో ఉంది. ప్రొటీస్ జట్టు 4 మ్యాచ్‌లలో మూడు విజయాలు, ఒక ఓటమితో 36 పాయింట్లను కలిగి ఉంది. గెలుపు శాతం 75 పర్సంటేజ్ . మూడో టెస్టులో నెగ్గడం ద్వారా న్యూజిలాండ్ దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టే అవకాశం ఉంది. తాజా డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో శ్రీలంక నాలుగో స్థానంలో, పాకిస్థాన్ ఐదో స్థానంలో, భారత్ ఆరో స్థానంలో నిలిచాయి. రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక ఒకటి గెలిచి ఒకటి డ్రా చేసుకుంది. శ్రీలంక గెలుపు శాతం కూడా 66.67గా ఉంది.
పాకిస్తాన్ రెండు మ్యాచ్‌లలో ఒక విజయం, ఒక ఓటమితో మొత్తం 12 పాయింట్లు సాధించింది. విజయాల శాతం 50. భారత్ 9 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలను నమోదు చేసింది. 4లో ఓటమి చవిచూడగా, ఒకటి డ్రా చేసుకుంది. భారత్‌కు 52 పాయింట్లు ఉండగా.. గెలుపు శాతం 48.15గా ఉంది.
ఇంగ్లండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నాయి. ఇంగ్లండ్ ఆడిన 7 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు నమోదు చేయగా, నాలుగింటిలో ఓడి ఒక మ్యాచ్‌ను మాత్రమే డ్రా చేసుకుంది. అతను 26 పాయింట్లు మరియు విజేత శాతం 30.95.
బంగ్లాదేశ్ రెండు మ్యాచ్‌లు ఆడగా, ఒక మ్యాచ్‌లో ఓడి, ఒకటి డ్రా చేసుకుంది. 4 పాయింట్లతో ఆ జట్టు గెలుపు శాతం 16.67. కరీబియన్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 6 ఓడిపోయి ఒక మ్యాచ్‌ను డ్రా చేసుకుని దారుణ స్థితిలో ఉంది. 4 పాయింట్లతో ఆ జట్టు గెలుపు శాతం 4.76గా ఉంది.