వేగ‌మే త‌న ఆయుధం.. క్రికెట్‌కు త్వ‌ర‌గానే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By Medi Samrat  Published on  10 Jan 2025 9:36 PM IST
వేగ‌మే త‌న ఆయుధం.. క్రికెట్‌కు త్వ‌ర‌గానే రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఫాస్ట్ బౌలర్

భారత జట్టు ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ శుక్రవారం క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను తన ఇన్‌స్టా హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని ఇచ్చాడు. వరుణ్ ఆరోన్ పోస్టులో ఫాస్ట్ బౌలింగ్ నా ప‌స్ట్ ల‌వ్‌.. ఎల్లప్పుడూ నా జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. 35 ఏళ్ల ఆరోన్ 2023/24 దేశవాళీ క్రికెట్ సీజన్ ముగింపులో రెడ్ బాల్ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కూడా గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు.

వరుణ్ తన భావోద్వేగ పోస్ట్‌లో.. గత 20 సంవత్సరాలుగా, నేను ఫాస్ట్ బౌలింగ్ థ్రిల్‌తో జీవించాను, శ్వాసించాను, అభివృద్ధి చెందాను. అపారమైన కృతజ్ఞతతో నేను క్రికెట్ కు నా రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను. దేవుడు, నా కుటుంబం, స్నేహితులు, సహచరులు, కోచ్‌లు, సహాయక సిబ్బంది, అభిమానులు లేకుండా ఈ ప్రయాణం సాధ్యం కాదని పేర్కొన్నాడు.

వరుణ్‌ 2010-11 విజయ్ హజారే ట్రోఫీలో గంటకు 150 కి.మీ కంటే ఎక్కువ వేగంతో బంతిని విసిరి సంచలనం సృష్టించాడు. అయితే గాయాల కారణంగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఆరోన్ 88 లిస్ట్ A మ్యాచ్‌లలో 5.44 ఎకానమీ రేటుతో 141 వికెట్లు తీశాడు. ఇవి కాకుండా వరుణ్‌ 95 టీ20 మ్యాచుల్లో 93 వికెట్లు తీశాడు.

2011లో వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన వరుణ్ భారత్ తరఫున ఆడిన మొత్తం తొమ్మిది టెస్టు మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. తన టెస్టు అరంగేట్రంకు కేవలం ఒక నెల ముందు అత‌డు ఇంగ్లాండ్‌తో వన్డేలో ఆడే అవకాశం పొందాడు. వరుణ్‌ తొమ్మిది వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. వరుణ్ 52 ఐపిఎల్ మ్యాచ్‌లలో మొత్తం 44 వికెట్లు తీశాడు.

వరుణ్ తన చివరి టెస్టు మ్యాచ్‌ను నవంబర్ 2015లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. చివరిసారిగా నవంబర్ 2014లో శ్రీలంకపై భారత్ తరఫున వన్డేలో ఆడాడు. ఐపీఎల్‌లో తన చివరి మ్యాచ్‌ను ఏప్రిల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాడు.

Next Story