రూ. 10.5 కోట్ల విలువైన కారు కొన్న యువ క్రికెటర్
By - Medi Samrat |
భారత యువ క్రికెటర్ అభిషేక్ శర్మ తన కార్ కలెక్షన్‌లో మరో అద్భుతమైన కారును చేర్చుకున్నాడు. అభిషేక్ ఇటీవలే ఫెరారీ పురోసాంగ్యూని కొనుగోలు చేసాడు, దీని ధర సుమారు రూ. 10.5 కోట్లు. అభిషేక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ కొత్త కారుకు సంబంధించి రెండు ఫోటోలరు షేర్ చేశాడు. అందులో అతడు డెనిమ్ జాకెట్, సన్ గ్లాసెస్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అభిషేక్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫెరారీ అతని పవర్-హిట్టింగ్ స్టైల్‌కు సరిగ్గా సరిపోతుందని అభిమానులు అభివర్ణించారు.
అభిషేక్ శర్మ ఆసియా కప్ 2025లో ఏడు ఇన్నింగ్స్‌లలో 314 పరుగులు చేయడం ద్వారా టాప్ రన్-గెటర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌పై 39 బంతుల్లో 74 పరుగుల ఇన్నింగ్స్ అతనికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ టైటిల్‌ను సంపాదించిపెట్టింది. అతడు టోర్నమెంట్‌లో బహుమతిగా అందుకున్న హవల్ H9 SUV కూడా వార్తల్లో ఉండగా, అతనికి ఇష్టమైన ఫెరారీ పురోసాంగ్యూ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఫెరారీ పురోసాంగ్యూ V12 ఇంజన్. ఈ ఇంజన్ 725 హార్స్ పవర్, 716 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT), రియర్-వీల్ డ్రైవ్ (RWD) సిస్టమ్‌ను కలిగి ఉంది. ఈ కారు కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని ఇంటీరియర్‌లో ఎలక్ట్రోక్రోమిక్ గ్లాస్ రూఫ్, మసాజ్ ఫ్రంట్ సీట్లు (10 ఎయిర్‌బ్యాగ్‌లతో), మరియు ఎయిర్ క్వాలిటీ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కూడా మొదటిసారిగా ఫెరారీలో అందుబాటులో ఉన్నాయి. ఇది ఆటోమేటిక్ సాఫ్ట్-క్లోజ్ డోర్లు, వెనుక ప్రయాణీకుల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్, USB-C పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.