గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది.

By -  Knakam Karthik
Published on : 26 Nov 2025 2:05 PM IST

Sports News, Guwahati Test, South Africa, India

గౌహతి టెస్ట్‌లో భారత్ ఓటమి, దక్షిణాఫ్రికా చేతిలో 0-2 తేడాతో వైట్‌వాష్

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 2‌‌–0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను సౌతాఫ్రికా కైవసం చేసుకుంది. 549 పరుగుల భారీ టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌​లో బరిలో దిగిన ఈ టార్గెట్ ను ఛేదించే క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులే అత్యధికం. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 140 పరుగుల వద్ద భారత్ కుప్పకూలింది. దీంతో 408 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది.

ఈ విజయంతో 2‌‌–0 తేడాతో టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ వైట్‌వాష్‌ కు గురైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హార్మర్‌ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్‌ 2 వికెట్లు పడగొట్టారు. ముత్తుస్వామి, మార్కో యాన్సన్‌ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేయగా, భారత్‌ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్ చేసింది.

Next Story