విజయంతో సెమీఫైనల్ లో అడుగుపెట్టిన భారత్

IND win by 71 runs, top Group 2. భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయంతో సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది.

By Medi Samrat  Published on  6 Nov 2022 5:11 PM IST
విజయంతో సెమీఫైనల్ లో అడుగుపెట్టిన భారత్

భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్ లో విజయంతో సెమీ ఫైనల్ లో అడుగుపెట్టింది. జింబాబ్వే 17.2 ఓవర్లు ఆడి 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్, హర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, పేసర్లు మహ్మద్ షమీ, హార్ధిక్ పాండ్యా చెరో 2 వికెట్లు, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డ్' దక్కింది.

టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రోహిత్ శర్మ (15) మరోసారి నిరాశపరిచాడు. ఆ తరువాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ(26)తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. పది ఓవర్లు ముగిసే టైమ్ కు టీమిండియా 79 పరుగులు చేసింది. ఆ తరువాత విలియమ్స్‌ బౌలింగ్‌లో భారీ షాట్ కు ప్రయత్నించి విరాట్ కోహ్లీ (26) ఔట్ అయ్యాడు, హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న రాహుల్ (51) కూడా వెనుదిరిగాడు. కాసేపటికి రిషభ్‌ పంత్ (3) కూడా ఔటయ్యాడు. చివర్లో సూర్యకుమార్ (61) సూపర్ ఇన్నింగ్స్ తో టీమిండియా భారీ స్కోర్ చేయగలిగింది. కేవలం 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు.


Next Story