అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతన్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా చేసిన 480 పరుగులకు సమాధానంగా.. భారత్ మూడు వికెట్లకు 289 పరుగులు చేసింది. భారత్ ఇంకా 191 పరుగుల వెనుకంజలో ఉంది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసేసరికి విరాట్ కోహ్లి 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. మూడో రోజు ఉదయం 36/0తో మొదలైన భారత్ ఇన్నింగ్సులో శుభమన్ గిల్ (128 పరుగులు) సెంచరీ చేశాడు. తద్వారా ఈ ఏడాది 5వ సెంచరీ నమోదుచేసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (35 పరుగులు), పుజారా (42 పరుగులు), కోహ్లీతో కలిసి గిల్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. గిల్ ఔట్ అయిన తర్వాత.. కోహ్లి హాఫ్ సెంచరీ చేశాడు. సుదీర్ఘ విరామం తర్వాత 15 ఇన్నింగ్స్‌లు((14 నెలలు) తర్వాత కోహ్లీ యాభై పరుగులు సాధించాడు. అంతకుముందు.. 2022 జనవరి 11న దక్షిణాఫ్రికాపై కోహ్లి ఫిఫ్టీ చేశాడు.