హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 17 వేల ప‌రుగుల మైలురాయిని రోహిత్ శ‌ర్మ అందుకున్నాడు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 March 2023 1:24 PM IST
Rohit Sharma, IND vs AUS

రోహిత్ శ‌ర్మ

టీమ్ఇండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 17 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 22 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోర్ వ‌ద్ద ఈ ఘ‌న‌త‌ను చేరుకున్నాడు. త‌ద్వారా ఈ ఫీట్‌ను అందుకున్న ఆరో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. రోహిత్ కంటే ముందు సచిన్ టెండూల్కర్‌ రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలు ఉన్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 17 వేల‌కు పైగా ప‌రుగులు చేసిన భార‌త ఆట‌గాళ్ల జాబితా

- సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌ల్లో 34,357

- విరాట్ కోహ్లీ 494 మ్యాచ్‌ల్లో 25,047

- రాహుల్ ద్రవిడ్ 504 మ్యాచ్‌ల్లో 24,064

- సౌరవ్ గంగూలీ 421 మ్యాచ్‌ల్లో 18,433

- మహేంద్ర సింగ్ ధోనీ 535 మ్యాచ్‌ల్లో 17,092

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 480 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భార‌త్ ప్ర‌స్తుతం వికెట్ న‌ష్టానికి 150 ప‌రుగులు చేసింది. రోహిత్ శ‌ర్మ 35 ప‌రుగులు చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. ఛ‌తేశ్వ‌ర్ పుజారా 34, శుభ్‌మ‌న్ గిల్ 76 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు. ఆసీస్ క‌న్నా భార‌త్ ఇంకా 330 ప‌రుగులు వెనుక ఉంది

Next Story