మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగే టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌లో బాబర్ అజం నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ప్రత్యేక సందేశం పంపారు. 1992లో మెల్‌బోర్న్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్‌కు తన జట్టుకు అందించిన సందేశం ఇదేనని ఇమ్రాన్ ఖాన్ వెల్లడించాడు.
"ఈ రోజు పాక్ క్రికెట్ జట్టుకు నా సందేశం 1992 ప్రపంచ కప్ ఫైనల్‌లో నేను మా జట్టుకు అందించిన సందేశమే. మొదటిది: ప్రపంచ కప్ ఫైనల్‌లో ఆడటం చాలా అరుదు కాబట్టి ఆ రోజును ఆస్వాదించండి. దాని గురించి ఆశ్చర్యపోకండి. రెండవది: మీరు రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే.. ప్రత్యర్థులు చేసే తప్పులను క్యాష్ చేసుకోగలిగితే మీరు గెలుస్తారు" అని ఇమ్రాన్ ఖాన్ తన ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. భారత్, జింబాబ్వే జట్ల మీద ఓటమి నుండి తిరిగి పుంజుకుంది.. గ్రూప్ దశలు దాటిన పాకిస్తాన్ 1992ని పునరావృతం చేయాలని చూస్తోంది. గ్రూప్ దశలో తమ చివరి 3 మ్యాచ్‌లను గెలుపొంది సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది.సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఇంగ్లాండ్‌తో ఫైనల్‌కు సిద్ధమయ్యారు.