రిటైర్మెంట్‌పై U-టర్న్ తీసుకున్న స్టార్ ఆల్ రౌండర్..!
పాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ హీరో ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నట్లు సంకేతాలిచ్చాడు.
By Medi Samrat Published on 20 March 2024 11:15 AM GMTపాకిస్థాన్ సూపర్ లీగ్ 2024 ఫైనల్ హీరో ఇమాద్ వాసిమ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రానున్నట్లు సంకేతాలిచ్చాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌ను PSL 2024 ఛాంపియన్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన వసీమ్.. రిటైర్మెంట్ పై U-టర్న్ తీసుకునే విషయమై కీలక వ్యాఖ్యలు చేశాడు. జాతీయ జట్టుకు అవసరమైతే.. నేను అందుబాటులో ఉంటానన్నాడు. గత ఏడాది నవంబర్‌లో ఇమాద్ రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇమాద్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో అతడిని జట్టులోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత టీ20 అంతర్జాతీయ కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు తనను సంప్రదించినట్లు ఇమాద్ వెల్లడించాడు. పీఎస్ఎల్ తర్వాత తన నిర్ణయాన్ని తెలియజేయగలనని ఇమాద్ షాహీన్ అఫ్రిదీతో చెప్పాడు.
నేను పాకిస్థాన్‌కు ఆడినప్పుడు పేరు సంపాదించాను. నా దేశానికి అవసరమైనప్పుడు నేను అందుబాటులో ఉంటాను. అవసరం లేకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు. నా రిటైర్మెంట్ తర్వాత షాహీన్ ఫోన్ చేసాడు. కానీ పిఎస్ఎల్ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పానని వివరించాడు.
ఇమాద్ వసీమ్ జాతీయ జట్టుకు దూరం కావడం తనకు ఇష్టం లేదని ఇస్లామాబాద్ యునైటెడ్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ వెల్లడించాడు. రిటైర్మెంట్ తర్వాత ఇమాద్‌కు ఫోన్ చేశానని షాదాబ్ చెప్పాడు. ఆల్ రౌండర్ ఇమాద్ లాంటి ఆటగాడి అవసరం ఉందని.. త్వరలో రిటైర్మెంట్ పై యూ టర్న్ తీసుకుని జాతీయ జట్టులోకి వస్తానని చెప్పాడని షాహిన్ చెప్పినట్లుగా పేర్కొన్నాడు.
ఇమాద్ వసీం 2021 టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టులో సభ్యుడు. అయితే 2022లో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఆల్ రౌండర్ పీఎస్ఎల్ సమయంలో అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్లో ముల్తాన్ సుల్తాన్స్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్లో ఇమాద్ 5 వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.