కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!

భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు.

By Medi Samrat  Published on  31 Dec 2024 9:13 AM IST
కెప్టెన్ కాక‌పోతే రోహిత్ జ‌ట్టులోనే ఉండేవాడు కాదు..!

భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నలు సంధించాడు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ ఓపెనింగ్‌కు వచ్చాడు. అయినా అతని ఫామ్‌లో ఎటువంటి మార్పు లేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వరుసగా 3 పరుగులు, 9 పరుగులు మాత్రమే చేసి రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరుకున్నాడు. పేలవ ఫామ్ తర్వాత రోహిత్‌పై పలు విమర్శలు వస్తున్నాయి.

ఈ ఎపిసోడ్ త‌ర్వాత‌ భారత జట్టు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్.. రోహిత్ గురించి సంచ‌ల‌న కామెంట్స్ చేఆడు. రోహిత్ కెప్టెన్‌గా ఉండకపోతే ప్లేయింగ్-11లో ఉండేవాడిని కాదని ఇర్ఫాన్ అన్నాడు. రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నందున మాత్రమే ప్లేయింగ్-11లో ఉన్నాడని, అతని ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే అతనికి ప్లేయింగ్-11లో అవకాశం లభించదని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.

స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన ఇర్ఫాన్.. 20 వేల పరుగులు చేసిన ఆటగాడు.. రోహిత్ పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న తీరు చూస్తే అతని ఫామ్ అతని దగ్గర లేదనిపిస్తుంది. అతను జట్టు కెప్టెన్, అందుకే ఆడుతున్నాడు. అతను కెప్టెన్‌గా లేకుంటే ప్రస్తుతం అత‌ను జ‌ట్టులో ఉండేవాడు కాదు. అతను మొత్తం టీమ్‌ని సిద్ధంగా చేశాడు. KL రాహుల్, యశస్వి ఓపెనింగ్‌కు అందుబాటులో ఉన్నారు, శుభమాన్ గిల్ కూడా ఉన్నాడు.

“వాస్తవాన్ని పరిశీలిస్తే.. అతనికి బహుశా ప్లే-11లో చోటు లభించకపోవచ్చు. తను కెప్టెన్ కాకుంటే కేఎల్ రాహుల్, యశస్వి, శుభ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లకు మరిన్ని ఓపెనింగ్ అవకాశాలు వచ్చేవన్నాడు. రోహిత్ జట్టుకు కెప్టెన్ అని, తర్వాతి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే.. రోహిత్ జట్టు కొనసాగాలి కానీ అతని ఫామ్ చెడ్డగా ఉంద‌న్నాడు. ఆస్ట్రేలియాకు రాకముందు భారత్‌లోనూ అతని ఫామ్‌ దారుణంగా ఉంది. అతను పరుగులు చేయలేకపోయాడు. రోహిత్ బ్యాటింగ్ చూస్తుంటే నాకు చాలా నిరాశగా అనిపించిందన్నాడు.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఇప్పటి వరకు ఆడిన మూడు టెస్టు మ్యాచ్‌ల్లో 32 పరుగులు చేశాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ పెర్త్ టెస్టు ఆడలేకపోయాడు. అతను అడిలైడ్ టెస్ట్‌లో తిరిగి జ‌ట్టులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 పరుగులు, బ్రిస్బేన్ టెస్ట్‌లో 10 పరుగులు, మెల్‌బోర్న్‌లో 12 పరుగులు చేశాడు.

Next Story