జ‌ట్టు రాకున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నుంచి వారొస్తార‌ట‌..!

భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి బంగ్లాదేశ్ జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను ఐసీసీ పరిశీలిస్తోంది.

By -  Medi Samrat
Published on : 27 Jan 2026 8:40 PM IST

జ‌ట్టు రాకున్నా.. టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా నుంచి వారొస్తార‌ట‌..!

టీ20 వరల్డ్ కప్‌కు బంగ్లా జర్నలిస్టులు వచ్చే అవకాశం

భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు సంబంధించి బంగ్లాదేశ్ జర్నలిస్టుల మీడియా అక్రిడిటేషన్ ప్రక్రియను ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ జట్టు తప్పుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే పలువురు బంగ్లా జర్నలిస్టుల దరఖాస్తులను తిరస్కరించినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. టోర్నీ నుంచి బంగ్లా జట్టు వైదొలగడంతో షెడ్యూళ్లు, అభ్యర్థనల సంఖ్యలో మార్పులు వచ్చాయని, అందుకే అక్రిడిటేషన్ జాబితాలను తిరిగి రూపొందిస్తున్నామని తెలిపాయి. సుమారు 80-90 మంది బంగ్లాదేశ్ జర్నలిస్టులు అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఒకవేళ వారి జట్టు టోర్నీలో పాల్గొన్నా దేశ కోటా ప్రకారం 40 మందికి మించి అనుమతించడం సాధ్యం కాదని ఐసీసీ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మీడియా విభాగం అధికారి అమ్జద్ హుస్సేన్ తెలిపారు. తాజా నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్ మీడియా సభ్యులు మళ్లీ అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి దరఖాస్తును కేసుల వారీగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారు.

Next Story