టీమిండియాకు మరో దెబ్బ
ICC punishes Shubman Gill for 'inappropriate' outburst, Team India slapped with heavy fine after losing WTC final. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత్ కు మరో షాక్.
By Medi Samrat Published on 12 Jun 2023 5:29 PM ISTవరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఓడిపోయిన భారత్ కు మరో షాక్. డబ్ల్యూటీసీ ఫైనల్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసిన ఆస్ట్రేలియా, భారత్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. ఫైనల్లో మరీ నెమ్మదిగా బౌలింగ్ చేసిన ఇండియా జట్టుకు మ్యాచ్ ఫీజులో 100 శాతం ఫైన్ వేశారు. ఆస్ట్రేలియా జట్టుకు మ్యాచ్ ఫీజులో 80 శాతం ఫైన్ వేశారు. నిర్దేశిత సమయంలో ఇండియా 5 ఓవర్లు తక్కువగా వేసిందని, ఆస్ట్రేలియా నాలుగు ఓవర్లు తక్కువగా వేసినట్లు ఐసీసీ తన ప్రకటనలో చెప్పింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల 2.22 ప్రకారం ఒక ఓవర్ ఆలస్యమైతే మ్యాచ్ ఫీజులో 20 శాతం ఫైన్ విధిస్తారు.
రెండో ఇన్నింగ్స్‌లో వివాదాస్పద రీతిలో ఔటైన శుభమన్ గిల్ థర్డ్ అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశాడు. అయితే గిల్ ప్రవర్తన సరిగా లేని కారణంగా అతనికి అదనంగా 15 శాతం ఫైన్ వేశారు. దీంతో గిల్‌పై మొత్తం 115 శాతం జరిమానా విధించారు. ప్రవర్తనా నియమావళిలోని 2.7 రూల్‌ను గిల్ అతిక్రమించినట్లు ఐసీసీ తన ప్రకటనలో పేర్కొంది. ఈ మ్యాచ్ లో శుభమాన్ గిల్ ఔట్ అయిన తీరుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. రెండో ఇన్నింగ్స్ లో అతడి క్యాచ్ అవుట్ కు సంబంధించి గిల్ రివ్యూకి వెళ్లాడు. గిల్ రివ్యూపై సమీక్షించిన థర్డ్అంపైర్‌కి అల్ట్రాఎడ్జ్‌లో కెమెరా యాంగిల్‌తో పరిశీలించగా గ్రీన్ బంతిని అందుకున్నప్పటికి నేలకు తాకించినట్లు కనిపించింది. కానీ గ్రీన్ చేతి వేలు బంతి కింద ఉందని థర్డ్‌అంపైర్ మైక్‌లో ప్రకటించి బిగ్ స్క్రీన్‌పై గిల్ ఔట్ అని చూపించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో గిల్ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు.