అక్టోబర్ నెలలో ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 మొదలు కాబోతోంది. ఈ టోర్నమెంట్ గెలిచిన జట్టుకు $1.6 మిలియన్లు (రూ. 13 కోట్లు) దక్కుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈ రోజు తెలిపింది. మొత్తం ప్రైజ్ పాట్ $5.6 మిలియన్లు (రూ. 45 కోట్లు) కాగా.. రన్నరప్‌లకు $800,000 (రూ. 6.5 కోట్లు).. సెమీ-ఫైనలిస్ట్‌లు $400,000 (రూ. 3.2 కోట్లు) అందుకుంటారు. అక్టోబర్ 16 నుంచి ఈ టోర్నమెంట్ ను ఆస్ట్రేలియాలోని ఏడు వేదికలలో నిర్వహించనున్నారు. సూపర్ 12 దశలో నిష్క్రమించే ఎనిమిది జట్లు ఒక్కొక్కటి $70,000 (రూ. 57 లక్షలు) అందుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ మరియు దక్షిణాఫ్రికా తమ టోర్నీని సూపర్ 12 దశలో ప్రారంభించడం ఖాయమైంది. నమీబియా, నెదర్లాండ్స్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వే మొదటి రౌండ్‌లో పోటీ పడి.. మెయిన్ టోర్నమెంట్ లో భాగమవ్వనున్నాయి.
ICC T20 ప్రపంచ కప్ 2022 ప్రైజ్ మనీ పట్టిక
విజేతలు - $1,600,000 (రూ. 13 కోట్లు)
రన్నర్స్ - $800,000 (రూ. 6.5 కోట్లు)
సెమీ-ఫైనలిస్టులు - $400,000 (రూ. 3.2 కోట్లు)
సూపర్ 12 విజయాలు - $40,000 (రూ. 32 లక్షలు)
సూపర్ 12 ఎగ్జిట్ - $70,000 (రూ. 57 లక్షలు)
మొదటి రౌండ్ విజయం - $40,000 (రూ. 32 లక్షలు)
మొదటి రౌండ్ నిష్క్రమణ - $40,000 (రూ. 32 లక్షలు)
మొత్తం - $5.6 మిలియన్ (రూ. 45 కోట్లు)