విరాట్ కుమార్తెను రేప్ చేస్తామంటూ బెదిరింపులు.. హైదరాబాదీ అరెస్ట్

Hyd Techie who Tweeted threats to Virat Kohlis Daughter Arrested by Mumbai Police. టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అనుకున్నంత ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో అభిమానులు తీవ్ర బాధను

By Medi Samrat
Published on : 10 Nov 2021 6:08 PM IST

విరాట్ కుమార్తెను రేప్ చేస్తామంటూ బెదిరింపులు.. హైదరాబాదీ అరెస్ట్

టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అనుకున్నంత ప్రదర్శన ఇవ్వలేదు. దీంతో అభిమానులు తీవ్ర బాధను వ్యక్తం చేశారు. కొందరు ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు చేశారు.. ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు. కొందరైతే ఆటగాళ్ల కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేశారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కుమార్తె పై కూడా అత్యంత దారుణమైన కామెంట్లు చేయడాన్ని పలువురు తీవ్రంగా తప్పుబట్టారు. అయితే కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన కేసులో హైదరాబాదుకు చెందిన వ్యక్తి అరెస్ట్‌ అయ్యాడు. టీ-20 మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో ఓటమి తరువాత కోహ్లీ కూతురిని రేప్‌ చేస్తానని బెదిరించిన వ్యక్తి హైదరాబాద్‌కు చెందిన అలిబత్తిని రాంనాగేశ్‌ గా గుర్తించారు.

23 ఏళ్ల రాంనాగేశ్‌ను ముంబై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ముంబైకి తరలించి విచారణ జరుపుతున్నారు. మహ్మద్‌ సమీకి సపోర్ట్‌ ఇచ్చిన్నందుకు కోహ్లీని బెదిరించాడు రాంనాగేశ్‌. పాక్ మ్యాచ్ అనంతరం షమీకి కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలవడంతో కొందరు నెటిజన్లు కోహ్లీపై విరుచుకుపడ్డారు. విరాట్ భార్య, నటి అనుష్క శర్మ సహా వారి కూతురు వామికపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన కామెంట్స్ చేశారు. ఈ కేసును సుమోటోగా తీసుకుంది ఢిల్లీ మహిళా కమీషన్. వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఎఫ్‌ఐఆర్ తమకు అందించాలని ఆదేశించింది. ఈ క్రమంలో కామెంట్లు చేసిన వారిలో ఒకరైన హైదరాబాద్‌కు చెందిన రాంనాగేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకొందరిని కూడా వెతికే పనిలో ఉన్నారు అధికారులు.


Next Story