టిక్కెట్లే కాదు.. ఆ ఇద్దరి పేర్లతో ఉన్న జెర్సీలు కూడా భారీగా అమ్ముడయ్యాయి..!
భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుండి జరగనుంది.
By Medi Samrat Published on 25 Sept 2024 5:55 PM ISTభారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 27 నుండి జరగనుంది. కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టెస్టులో భారత జట్టు 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవడంపైనే టీమిండియా దృష్టి ఉంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు తొలి టెస్టులో బ్యాటింగ్ చేయకపోయినా.. రెండో టెస్టులో వీరిద్దరు భారీ ఇన్నింగ్స్‌లు ఆడుతారని అందరూ ఆశిస్తున్నారు. ఈ క్రమంలోనే కాన్పూర్ టెస్ట్ మ్యాచ్ కోసం గ్రీన్ పార్క్ స్టేడియం వెలుపల విరాట్, రోహిత్ పేర్లతో కూడిన జెర్సీలకు క్రికెట్ ప్రేమికుల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
గత కొన్నేళ్లుగా మ్యాచ్ చూసేందుకు వచ్చే అభిమానులకు జెర్సీలు, జెండాలు విక్రయిస్తున్న పలువురు మంగళవారం వీఐపీ పెవిలియన్ బయట ఉన్న టికెట్ కౌంటర్ దగ్గర గుమిగూడారు. ఆటగాళ్ల పేర్లతో ఉన్న టీ-షర్టులను వారు విక్రయించారు. టిక్కెట్లు కొనేందుకు వచ్చిన క్రికెట్ ప్రేమికులు.. విరాట్, రోహిత్‌లతో పాటు జడేజా, స్థానిక కుర్రాడు కుల్దీప్ పేర్లతో ఉన్న జెర్సీలను భారీగా కొనుగోలు చేశారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించలేకపోయాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ కోహ్లీ తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో అభిమానులు రెండో టెస్టులో వీరిద్దరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తున్నారు.