ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే.?

హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు ఓటములను ఎదుర్కొంది ముంబై ఇండియన్స్. ప్లేఆఫ్‌కు వెళ్లే మార్గం చాలా కష్టంగానే ఉంది

By Medi Samrat  Published on  23 April 2024 7:45 AM GMT
ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కు చేరాలంటే.?

హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు ఓటములను ఎదుర్కొంది ముంబై ఇండియన్స్. ప్లేఆఫ్‌కు వెళ్లే మార్గం చాలా కష్టంగానే ఉంది. అయితే MI ఇప్పటికీ ప్లేఆఫ్ స్పాట్ కోసం పోటీలో ఉంది. ముంబై ఇండియన్స్ మిగిలిన ఆరు మ్యాచ్ లలో ఐదింటిలో విజయాలు సాధించాలి. అయినప్పటికీ.. నెట్ రన్ రేట్ (NRR) కీలకం కానుంది. ముంబై జట్టు సమిష్టిగా రాణించడంలో విఫలమవుతూ ఉంది. ఆటగాళ్లలో ఏ మాత్రం నిలకడ కనిపించకపోవడంతో జట్టుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఆ జట్టుకు సామర్థ్యం ఉన్నప్పటికీ.. ఇంకా టోర్నమెంట్‌లో ఊపు రావడం లేదు. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్ఫూర్తిని నింపడంలో విఫలమయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా మాత్రమే నిలకడగా రాణిస్తూ ఉన్నాడు.. బౌలింగ్ లో అతడికి చెప్పుకోదగ్గ సహకారాలు లేవు.

ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ ఇంకా ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ 6 మ్యాచ్‌లు గెలవాలి. ఒక్కదాంట్లో ఓడినా ప్లేఆఫ్స్ చేరాలంటే రన్‌రేట్ కీలకంగా మారుతుంది. ముంబై తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఢిల్లీ, లక్నో, కోల్‌కతా, హైదరాబాద్, కోల్‌కతా, లక్నోతో ఆడాల్సి ఉంది. ఢిల్లీ తప్ప మిగతా మూడు జట్లు ఫామ్ మీదున్న విషయం తెలిసిందే. గతంలో ఇలాంటి సంచలనాలను నమోదు చేసి ముంబై ఇండియన్స్ ఏకంగా టైటిల్ ను నెగ్గింది. ఈసారి ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.

Next Story