IPL : కోట్లల్లో ఆ 13 మంది ఆటగాళ్ల బేస్ ధర.. కానీ వేలం జాబితాలో లేరేంటి..?
ఐపీఎల్ చాలా మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. కనుమరుగవుతున్న కొంతమంది సీనియర్ ఆటగాళ్లు
By Medi Samrat Published on 12 Dec 2023 2:11 PM GMTఐపీఎల్ చాలా మంది యువ ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది. కనుమరుగవుతున్న కొంతమంది సీనియర్ ఆటగాళ్లు ఇందులో అవకాశం పొందుతారు. ఈ వేదికపై ప్రతి సీజన్‌లో విభిన్నమైన ఆటగాళ్లు మెరుస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ తదుపరి సీజన్ వేలం కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తం 333 మంది ఆటగాళ్లు వేలానికి ఎంపికయ్యారు. వేలం కోసం విడుదల చేసిన జాబితాలో మొత్తం 13 మంది ఆటగాళ్ల పేర్లు జాబితాలో లేకపోవడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ20 క్రికెట్‌లో ఇప్పటికీ మెరుస్తున్న ఈ ఆటగాళ్ల బేస్ ధర కోట్ల రూపాయల్లో ఉంది. ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందాం.
IPL-2024 వేలం జాబితాలో లేని 13 మంది ఆటగాళ్ల పేర్లు
1. డార్సీ షార్ట్ (ఆస్ట్రేలియా) - రూ. 1 కోటి బేస్ ధర
2. కేన్ రిచర్డ్‌సన్ (ఆస్ట్రేలియా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
3. కోలిన్ ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
4. మార్టిన్ గప్టిల్ (న్యూజిలాండ్) - రూ. 1 కోటి బేస్ ధర
5. డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
6. మార్చంట్ డి లాంగే (దక్షిణాఫ్రికా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
7. కేదార్ జాదవ్ (భారతదేశం) - రూ. 2 కోట్లు బేస్ ధర
8. కోరీ ఆండర్సన్ (న్యూజిలాండ్) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
9. డేనియల్ వోరెల్ (ఆస్ట్రేలియా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
10. మోయిసెస్ హెన్రిక్స్ (ఆస్ట్రేలియా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
11. ఏంజెలో మాథ్యూస్ (శ్రీలంక) - రూ. 2 కోట్లు బేస్ ధర
12. క్రిస్ లిన్ (ఆస్ట్రేలియా) - రూ. 1.5 కోట్లు బేస్ ధర
13. టామ్ బాంటన్ (ఇంగ్లండ్) - రూ. 2 కోట్లు బేస్ ధర
ఐపిఎల్-2024 వేలం డిసెంబర్ 19 న దుబాయ్‌లో జరుగుతుంది. ఇందులో మొత్తం 333 మంది ఆటగాళ్లు షార్ట్‌లిస్ట్ చేయబడ్డారు. వారిలో 214 మంది భారతీయ ఆటగాళ్ళు, 119 మంది విదేశీ ఆటగాళ్లు. వేలానికి ఎంపికైన ఆటగాళ్లలో 116 మంది క్యాప్‌డ్, 215 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు ఉన్నారు. 23 మంది ఆటగాళ్ల బేస్ ధరను రూ.2 కోట్లు ఉండగా, 13 మంది ఆటగాళ్ల బేస్ ధర రూ.1.5 కోట్లుగా ఉంది.