అన్ని పుకార్లే.. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తోపాటు ఐపీఎల్ కూడా ఆడ‌నున్న హార్దిక్‌..!

ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి కొన్ని వార్తలు వైర‌ల్ అవుతున‌న్నాయి.

By Medi Samrat  Published on  24 Dec 2023 3:58 PM IST
అన్ని పుకార్లే.. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌తోపాటు ఐపీఎల్ కూడా ఆడ‌నున్న హార్దిక్‌..!

ఐపీఎల్ 2024కి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి కొన్ని వార్తలు వైర‌ల్ అవుతున‌న్నాయి. హార్దిక్ పాండ్యా గాయం నుంచి ఇంకా కోలుకోలేదని.. దీంతో అత‌డు ఐపీఎల్ ఆడడం క‌ష్ట‌మేన‌ని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఐపీఎల్‌కు ముందు ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్ జరగనుంది. అయితే హార్దిక్‌కు ఆ సిరీస్‌ కూడా ఆడడం కష్టమని వార్తలు వచ్చాయి. ఈ వార్త‌ల‌పై హార్దిక్ అభిమానులు నిరాశ చెందగా.. మరోవైపు రోహిత్ శర్మ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. హార్దిక్ ఐపీఎల్ ఆడ‌క‌పోతే రోహిత్ శర్మ మరోసారి ఐపీఎల్‌కు కెప్టెన్‌గా ఉంటాడని అభిమానులు భావించారు. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలుసుకుందాం.

హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకోలేదనేది కేవలం రూమర్ మాత్రమే. బీసీసీఐని ఉటంకిస్తూ నిన్న ఈ వార్త ప్రచురితమైంది. హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌తో పాటు ఐపీఎల్-2024 నుండి తప్పుకుంటాడని సోషల్ మీడియాతో సహా అన్ని ఛానెల్‌లలో బీసీసీఐ మూలాలను ఉటంకిస్తూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలో నిజమెంతో ఇవాళ వెలుగులోకి వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. ఈ వార్త పుకారు. హార్దిక్ పాండ్యా ప్ర‌స్తుతం క్షేమంగా ఉన్నాడు. రోజూ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌కు అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడు. కాబ‌ట్టి ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌కు జట్టులో చేరుతాడు.

ఐపీఎల్‌లో పాండ్యా ఆడలేడన్న వార్త కేవలం పుకారు మాత్రమేనని నివేదిక‌లు చెబుతున్నాయి. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్నాడు. ముంబై ఇండియన్స్‌కు కూడా అందుబాటులో ఉంటాడ‌ని చెబుతున్నారు. హార్దిక్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ గాయం గురించి కూడా తాజా సమాచారం వచ్చింది. సూర్య గాయం నుంచి ఇంకా కోలుకోలేదని.. కోలుకోవడానికి 5 నుంచి 6 వారాలు పట్టవచ్చని అంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగే సిరీస్‌కు సూర్య దూరం అయినప్పటికీ.. ఐపీఎల్ కంటే ముందే కోలుకుంటాడని కూడా స్పష్టమైంది.


Next Story