BCCI సెక్రటరీ జై షా ప్రశంసలు ఉన్నాయి.. 28 బంతుల్లో సెంచరీ చేశాడు.. అయినా వేలంలో అమ్ముడుపోలేదు..!
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ వార్తల్లో నిలిచాడు.
By Medi Samrat Published on 29 Nov 2024 8:40 AM ISTటీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసి భారత బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ వార్తల్లో నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ తరఫున ఆడుతున్న ఉర్విల్.. గత ఏడాది లిస్ట్-ఎలో భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని కూడా సాధించాడు. అయితే అతడు గత సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు.. కానీ అతడు ఈసారి వేలంలోకి విడుదలయ్యాడు. ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో కూడా అతడిని ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలం రెండవ రోజు ఉర్విల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.. ఆ మ్యాచ్‌లో అతని లక్ష్యం మ్యాచ్‌ను త్వరగా ముగించడం.. జట్టు రన్ రేట్‌ను మెరుగుపరచడం కాగా.. భారీ ఇన్నింగ్సుతో ఆ పని చక్కబెట్టాడు.
అయితే.. ఉర్విల్‌కి ఐపీఎల్ ఆడే అవకాశం దక్కకపోవడం చర్చనీయాంశమైంది. అయితే.. ఉర్విల్ ఐపీఎల్ ఎంట్రీకి తలుపులు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. ఇప్పటి వరకూ ఏ ఫ్రాంచైజీ అతన్ని సంప్రదించనప్పటికీ.. భవిష్యత్తులో అవకాశం ఉంటే.. జట్లు అతనిని సంప్రదించవచ్చు.. ఏదైనా జట్టు పర్స్‌లో డబ్బులు ఉండి లేదా ఎవరైనా ఆటగాడు గాయపడినట్లయితే.. ఫ్రాంచైజీ ఉర్విల్‌కు కాల్ చేయవచ్చు.
గత రెండు సంవత్సరాలుగా నవంబర్ 27 ఉర్విల్ జీవితంలో సంతోషకరమైన రోజుగా ఉంది. రెండు సార్లు ఒకే తేదీన రికార్డు ఇన్నింగ్స్ ఆడాడు. రికార్డు ఇన్నింగ్స్ తర్వాత.. BCCI సెక్రటరీ జై షా ఇంటర్నెట్ మీడియాలో అతనిని ప్రశంసించారు. ఉర్విల్ తుఫాను ఇన్నింగ్స్‌కు త్రిపుర జట్టు బలి అయ్యింది. ఉర్విల్ ధాటిగా బ్యాటింగ్ చేసి కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇద్దరు దిగ్గజాలు రిషబ్ పంత్, క్రిస్ గేల్ రికార్డులను ఉర్విల్ ఏకకాలంలో బద్దలు కొట్టాడు. 2018లో హిమాచల్ ప్రదేశ్‌పై పంత్ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. క్రిస్ గేల్ 2013లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఉర్విల్ పటేల్ 28 బంతుల్లో సెంచరీ సాధించాడు, కానీ అతను కేవలం ఒక బంతితో T20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీని సాధించలేకపోయాడు. ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. సైప్రస్‌పై సాహిల్ 27 బంతుల్లో సెంచరీ సాధించాడు.
టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
సాహిల్ చౌహాన్- 27 బంతుల్లో (ఎస్టోనియా vs సైప్రస్-2024)
ఉర్విల్ పటేల్ (28 బంతుల్లో (గుజరాత్ vs త్రిపుర- 2024)
క్రిస్ గేల్ (30 బంతుల్లో) (RCB vs పూణే వారియర్స్ - 2013)
రిషబ్ పంత్ (32 బంతులు (ఢిల్లీ vs హిమాచల్ ప్రదేశ్ - 2018)